ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఓటర్ మహాశయులకు నమస్కారం,
నేను మీ నూకల సూర్యప్రకాష్ ఉపాధ్యాయుడుగా 23½ సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు అనంతరం 2019 సంవత్సరంలో ఉద్యోగానికి ఇంకా పదిన్నర సంవత్సరాలు సర్వీస్ ఉండగా రాజీనామా చేసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది.
అనంతరం ఓటర్లలో చైతన్యం కోసం ” ఓటర్స్ ఫోరమ్ ఫర్ బెటర్ డెమోక్రసీ” అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఓటర్లలో అవగాహన, చైతన్యం కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అందులో భాగంగా మార్చి 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్లు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను.
విద్యార్థి దశ నుండి నేను పాఠశాలలోనూ, కళాశాలలోనూ విద్యార్థి నాయకుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా చిన్నతనం నుండి అనేక సేవా కార్యక్రమాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో పని చేయడం జరిగింది.
విద్యార్థిగా NCC, NSS వంటి యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొని వివిధ బాధ్యతలు నిర్వర్తించాను.
అదేవిధంగా చిన్నతనం నుండి కల్చరల్ ఆక్టివిటీస్ లోను, రచనలు చేయడంలోనూ నా యొక్క సమయాన్ని సద్వినియోగం చేయడం జరిగింది. అనేక పుస్తకాలను కూడా రాసి ప్రచురించారు.
పాత్రికేయునిగా ఆ తర్వాత ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విశాఖ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని మేనేజ్మెంట్లలో పనిచేశాను. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాలలో వివిధ బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది.
ఇప్పుడు రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఒక చైతన్యం కోసం, ఎన్నికల్లో మార్పుల కోసం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయుచున్నాను.
కావున ఉత్తరాంధ్ర పట్టభద్రులు నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించి, నా అర్హతలకు తగ్గ గుర్తింపునిచ్చి నాకు ప్రాధాన్యత ఓటింగ్ లో మొదటి(1) ప్రాధాన్యత ఇచ్చి గెలిపిస్తారని ఈ ఎన్నికల్లో ఒక సామాన్య వ్యక్తిని గెలిపించి శాసనమండలికి పంపిస్తారని మీ అందరిని కోరి ప్రార్థిస్తున్నాను.
రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగవలసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకు అతీతమైనటువంటి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించవలసినటువంటి అవసరాన్ని విజ్ఞులైన పట్టభద్రులు గుర్తించి ఓటు వేస్తారని సవినయంగా కోరుకుంటున్నాను.
నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఉత్తరాంధ్ర ప్రతి సమస్య పైన అందరితో కలిసి వెన్నంటి ఉండి ప్రజాక్షేత్రంలోనూ శాసన మండలిలోను పోరాడుతానని ప్రజల గొంతుతో గొంతు కలిపి, ప్రజల అడుగులో అడుగు వేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతానని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు నా పూర్తి మద్దతుతో పనిచేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను.
నా యొక్క ఇంకొక వాగ్దానం ఏమిటంటే ఉత్తరాంధ్ర శాసనమండలి పరిధి ప్రస్తుతం ఆరు(6) జిల్లాలకు విస్తరించి ఉంది. కావున ఈ ఆరు(6) జిల్లాల ప్రతినిధిగా వారంలో ఒకరోజు ఒక జిల్లాలో ఉంటూ అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి స్థానికంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.
కావున ప్రతి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటరు నా అభ్యర్థులను మన్నించి నాకు మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను.
కృతజ్ఞతలు
ఇట్లు
మీ భవదీయుడు
నూకల సూర్య ప్రకాష్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి