MLC ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలవగలరా❓
నేను మీ నూకల సూర్య ప్రకాష్ , ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) స్వతంత్ర అభ్యర్థిని.
నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించవలసిన అతి ముఖ్యమైన విషయం గురించి మీతో నా ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను.
సాధారణ ఎన్నికల్లో అభ్యర్థి గెలవడానికి పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు.
కానీ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపొందాలంటే అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ గెలుపును ప్రకటించడానికి వీలుపడదు. ఒక అభ్యర్థి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే పోలైన ఓట్లలో 50%+1 ఓటు (యాబై శాతం ప్లస్ ఒక ఓటు) వస్తేనే విజేతగా ప్రకటించడం జరుగుతుంది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ మార్చి 13న జరగనుంది. ఇందులో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన BJP, YSRCP, తెలుగుదేశం, కమ్యూనిస్టులు నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , BSP అభ్యర్థులు కూడా స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. వీరికి తోడు స్వతంత్ర అభ్యర్థులు కూడా 30 మంది పైనే ఉన్నారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో 37 మంది పోటీ చేస్తున్నారు.
అంటే పార్టీల యొక్క ఓటు బ్యాంక్ ఆధారంగా వారికి వచ్చే ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఏ ఒక్క అభ్యర్థికి 50 శాతం ఓట్లు వచ్చే అవకాశమే ఉండదు. దీనికి తోడు అధికంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి వారి స్థాయిలను బట్టి ఓట్లను చీల్చడం జరుగుతుంది. కాబట్టి ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత(1) ఓటు తో గెలిచే అవకాశమే ఉండదు.
ఈ ఎమ్మెల్సీ(MLC) ఎన్నిక ప్రాధాన్యత ఓటింగ్ విధానంలో జరుగుతుంది. అంటే ఒక ఓటరు తన యొక్క ఓటును ఎక్కువ మందికి ప్రాధాన్యత క్రమంలో వేయడం ద్వారా వినియోగించుకోవాలి. కొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు ఒకటి మాత్రమే వేసి ఊరుకుంటే ఏ అభ్యర్థి గెలుపొందే అవకాసం లేదు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులలో కనీసం కొందరికైనా ప్రాధాన్యతనిచ్చి ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,4…. ప్రాధాన్యత ఓట్లు వేసినట్లయితేనే రెండు మూడు నాలుగు ప్రాధాన్యత ఓట్ల ద్వారా అభ్యర్థి ఎంపిక జరిగే అవకాశం ఉంది.
మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఒక పార్టీ వ్యక్తికి మొదటి ప్రాధాన్యత వేసిన వ్యక్తి ఇంకో పార్టీకి రెండో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు చేతనంటే సిద్ధాంతాల ఆధారంగా వారి వారి పార్టీలకు ఓటు వేయడం జరుగుతుంది. వ్యతిరేక సిద్ధాంతాల పార్టీ అభ్యర్థులకు రెండు లేక మూడు ప్రాధాన్యత ఇవ్వడం జరగని పని అటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తే మంచిదనే విషయాన్ని విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి సందర్భంలో పార్టీల అభ్యర్థులు కాక స్వతంత్ర అభ్యర్థులకే విజయం చేకూరే అవకాశం ఉంది.
YSRCP కి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వారు TDP కానీ BJP కి కానీ కమ్యూనిస్టులకు కానీ ఓటు వేయలేరు. అదేవిధంగా తెలుగుదేశానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినవారు BJP కి కానీ YSRCP కానీ కమ్యూనిస్టులకు కానీ రెండో ప్రాధాన్యత ఇవ్వలేరు. కాబట్టి పట్టబద్రులు విజ్ఞతతో తమ యొక్క మొదటి రెండు ప్రాధాన్యతలు స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చి సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి.
అదేవిధంగా పార్టీల తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగిన అభ్యర్థి గెలుపొందినట్లయితే పార్టీల యొక్క సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు, క్రమశిక్షణకు తల వంచి ఆ పార్టీలు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడవలసి ఉంటుంది. అంతే తప్ప వాటిని వ్యతిరేకించి సరైనటువంటి చట్టాలు, నిర్ణయాలు తీసుకుందుకు కావలసిన సూచనలు చేయడానికి గాని ప్రజలతో కలిసి ప్రజల సమస్యలపై పోరాడటానికి కానీ ఏ విధమైన అవకాశం ఉండదు.
అదే విధంగా అధికారంలో ఉన్న పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజకీయ కారణాలతో నిర్ద్వందంగా వ్యతిరేకించవలసి వస్తుంది. అంతే తప్ప ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల యొక్క అవసరాలకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన విధంగా తమ యొక్క వాణిని వినిపించ గలిగే అవకాశం పార్టీల టికెట్లతో గెలిచిన ఎమ్మెల్సీ(MLC)లకు ఉండదు.
శాసనమండలి అంటే పెద్దల సభ. అసెంబ్లీ లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించి మేధావులుగా, వాటిలో మార్పులు, చేర్పులకు సూచనలు చేయటానికి కావలసిన అనుభవజ్ఞులు ఎమ్మెల్సీ(MLC) లుగా ఉన్నప్పుడే ఆ పెద్దల సభ యొక్క ప్రత్యేకత.
కావున శాసనమండలి కి ఎన్నికయ్యే వ్యక్తులు పార్టీలకతీతంగా సమాజ హితం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటటువంటి వారు ఉండాలి. అది స్వతంత్ర అభ్యర్థులు శాసనమండలికి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి విషయాలను సమర్థిస్తూ ప్రజలకు రాష్ట్రానికి నష్టాన్ని చేకూర్చే అంశాలను ఎండగడుతూ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయగలిగేటటువంటి అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటేనే ఆ పదవికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది.
అంతే తప్పా! రాజకీయ పంచన చేరి, వారి అడుగులకు మడుగులు వత్తే వ్యక్తులు ఎమ్మెల్సీలుగా శాసనమండలికి వెళితే ఏ విధమైన ఉపయోగం లేకపోగా ఆ పదవికే కళంకం వస్తుంది.
కాబట్టి విజ్ఞులైన పట్టభద్రులు తమ యొక్క ఓటును ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల యొక్క గుణగణాలు, సామర్థ్యాలను బట్టి తమ యొక్క ఓటును వినియోగించుకుంటారని మనసారా కోరుకుంటున్నాను.
ఒకవేళ పట్టభద్రులలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉంటే ఆ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే రెండో ప్రాధాన్యత తప్పకుండా ఇంకో పార్టీకి ఇవ్వలేరు కాబట్టి స్వతంత్ర అభ్యర్థులలో మంచివారికి ఓటు వేసి మీయొక్క ప్రాధాన్యత ఓటును వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.
ఈ క్రమంలో నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించి మీకు నాపై నమ్మకం ఉంటే మొదటి(1) ప్రాధాన్యత ఇవ్వండి. అది కుదరని పక్షంలో కనీసం రెండవ(2) ప్రాధాన్యతనైనా ఇచ్చి నాకు అవకాశాన్ని ఇస్తారని, ఆశీర్వదిస్తారని నా ద్వారా శాసనమండలిలో మీయొక్క గళాన్ని వినిపిస్తారని కోరుకుంటూ మరి సెలవు.
కృతజ్ఞతలు
ఇట్లు
మీ నూకల సూర్యప్రకాష్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
👉 పోలింగ్ తేదీ:13-3-23(సోమవారం)
👉🙏🙏🙏బాలట్ పేపర్ లో సీరియల్ నెంబర్: 25
🤝🤝 మీకు సరైన మెసేజ్ అనిపిస్తే ఈ మెసేజ్ ని మీ అన్ని గ్రూపు లలో ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.🤝🤝🤝🤝